
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) మేడ్చల్ జిల్లా దేవరయంజాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్