ధ్రువీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదు ‘సర్’: ఈసీఐ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) (SIR) ధ్రువీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది.
ECI


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) (SIR) ధ్రువీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీపై జులై 25న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డు డేటా ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసీఐ క్లారిటీ ఇచ్చింది. ‘సర్’లో ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఆమోదించడానికి కుదరదని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్ రేషన్కార్డుతో సమానమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande