
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎస్లోని రెస్ట్ రూమ్లో గత రాత్రి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన సహచర పోలీసులు వెంటనే అతడిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. సాయి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మరో వైపు కానిస్టేబుల్ బలవన్మరణంపై ఉన్నతాధికారులకు పోలీస్ స్టేషన్ సిబ్బంది సమాచారం అందించారు. ఉన్నతాధికారులు పీఎస్కు చేరుకుని.. సాయి ఆత్మహత్యపై ఆరా తీశారు. మంగళవారం కూడా అతడు విధులు నిర్వహించారని సిబ్బంది వెల్లడించారు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి గదిలో సాయి నివాసం ఉంటున్నాడని చెప్పారు.
సాయి మృతిపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు పీఎస్కు చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎల్బీ నగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 2024 బ్యాచ్లో సాయి కుమార్ (13128) కానిస్టేబుల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అతడిని అటాచ్మెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్