
కరీంనగర్ జిల్లా, 12 ఆగస్టు (హి.స.)
కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ (LMD) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుండటంతో, ఎప్పుడైనా వరద గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్యామ్ దిగువ ప్రాంతాల ప్రజలను, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈరోజు ఉదయం హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ వేట కోసం నదిలోకి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, నీటి ఉధృతిని నిరంతరం గమనిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi