లంకపల్లి అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్ల వేటు అటవీ శాఖ అధికారుల మెరుపు దాడులు
లంకపల్లి అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్ల వేటు అటవీ శాఖ అధికారుల మెరుపు దాడులు
లంకపల్లి అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్ల వేటు అటవీ శాఖ అధికారుల మెరుపు దాడులు

ఖమ్మం జిల్లా: 12 ఆగస్టు (హి.స.)

ఖమ్మం జిల్లాలోని లంకపల్లి అటవీ డివిజన్ పరిధిలో నిన్న రాత్రి అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున మెరుపు దాడులు నిర్వహించారు. అడవి నుంచి విలువైన టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో అధికారులు వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు. అర్ధరాత్రి సమయంలో కలపను లారీల్లోకి లోడ్ చేస్తున్న స్మగ్లర్లను అధికారులు చుట్టుముట్టారు. అధికారులను చూసి స్మగ్లర్లు అడవిలోకి పారిపోగా, సుమారు రూ. 15 లక్షల విలువైన టేకు దుంగలను మరియు రెండు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అడవుల రక్షణ కోసం సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని జిల్లా అటవీ అధికారి (DFO) హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande