వికారాబాద్ జిల్లాలో నకిలీ డిఎపి ఎరువుల కలకలం ఆందోళనలో స్థానిక రైతులు
వికారాబాద్ జిల్లాలో నకిలీ డిఎపి ఎరువుల కలకలం ఆందోళనలో స్థానిక రైతులు
వికారాబాద్ జిల్లాలో నకిలీ డిఎపి ఎరువుల కలకలం ఆందోళనలో స్థానిక రైతులు


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో నకిలీ ఎరువుల వ్యవహారం వెలుగులోకి రావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో నకిలీ డీఏపీ (DAP) ఎరువులను కొందరు కేటుగాళ్లు మార్కెట్లోకి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఎరువులను అసలైన బ్రాండెడ్ సంచుల రూపంలో ప్యాక్ చేసి అమాయక రైతులకు విక్రయిస్తున్నట్లు నిన్న రాత్రి అందిన ఫిర్యాదులతో వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలు దుకాణాలపై దాడులు నిర్వహించి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నాణ్యత లేని ఎరువులను వాడటం వల్ల పంట పెట్టుబడి నష్టపోవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఎరువుల విక్రయదారులపై కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దే ఎరువులు కొనాలని అధికారులు సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande