158 మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం
158 మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం
pawan


అమరావతి, 12 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోని మారుమూల పల్లెలు, ఆవాసాలకు రోడ్లు వేసేందుకు ఉపముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతుల మంజూరు ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. పలు జిల్లాల్లో ఇంతవరకు రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు. ఈ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.422 కోట్లు మంజూరయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande