
వరంగల్ జిల్లా: , 12 ఆగస్టు (హి.స.)
చారిత్రాత్మక వరంగల్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షానికి వరంగల్ కోట పరిసర ప్రాంతంలో భూమి కొంతమేర కుంగిపోయింది. ఈరోజు ఉదయం స్థానిక ప్రజలు గమనించగా, అక్కడ కొన్ని పురాతన కాకతీయుల కాలం నాటి శిల్పాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పురాతత్వ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లభించిన శిల్పాలు 12వ శతాబ్దానికి చెందినవని, వాటిపై ఉన్న చెక్కడాలు కాకతీయ కళా వైభవానికి నిదర్శనమని నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో మరిన్ని చారిత్రాత్మక ఆధారాలు ఉండే అవకాశం ఉందనే అనుమానంతో తవ్వకాలను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వార్త తెలియడంతో స్థానికులు శిల్పాలను చూడటానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi