వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలు
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు.
Train


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని కోరారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్, డోర్నకల్ - గద్వాల్ (కల్వకుర్తి మీదుగా) రైల్వే లైన్, కల్వకుర్తి - మాచర్ల రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

అలాగే, హైదరాబాద్ - అమరావతి - బందర్ పోర్ట్ సరకు రవాణా(ఫ్రైట్) కారిడార్, హైదరాబాద్ను పుణే-ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్(RRR) ప్రాజెక్ట్ ఫ్రైట్ & హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా కాచిగూడ - జగ్గయ్యపేట, పటాన్చెరు - ఆదిలాబాద్, బోధన్ - లాతూర్ ప్రాజెక్టుల డీపీఆర్(DPR) ప్రక్రియను వేగవంతం చేసి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఎంపీలు వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, వంశీ గడ్డం, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande