
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడంలో మరియు డిజిటల్ భద్రతను కల్పించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైబర్ క్రైమ్ బ్యూరోను ఏర్పాటు చేయడం, కేస్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడం వల్లనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, నేరగాళ్లు కాజేసిన సొమ్మును హోల్డ్ చేయడంలో తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా వేధింపులు మరియు ఫేక్ యాప్స్ ద్వారా జరిగే దోపిడీలను అరికట్టడానికి విసృత్తమైన అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో సైబర్ ల్యాబ్‌లను మరింత బలోపేతం చేస్తామని, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi