తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ..
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పీవీ సింధు..


తిరుమల, 12 ఆగస్టు (హి.స.) కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు గాను గురువారం దర్శనం కోసం బుధవారం జారీ చేసే ఎస్ఎస్డీ (SSD) టోకెన్ల పంపిణీని టీటీడీ నిలిపివేసింది. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో ఈ టోకెన్లు ఇవ్వరని, భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande