మార్కాపురంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ!
ప్రధాని మోదీ పిలుపు మేరకు మార్కాపురం పట్టణంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా నిర్వహించారు; బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
markapur-grand-har-ghar-tiranga-rally-held-to-promote-patriotism-172071


మార్కాపురం, 12 ఆగస్టు (హి.స.) మార్కాపురం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మార్కాపురం పట్టణంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీవీ శివారెడ్డి, స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మెంబర్, హర్ ఘర్ తిరంగా స్టేట్ కో-కన్వీనర్ హాజరై మాట్లాడారు. దేశ సమగ్రత, ప్రజల ఐకమత్యాన్ని చాటిచెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు, జిల్లా హర్ ఘర్ తిరంగా ఇన్చార్జ్ దేవిశెట్టి చంద్రశేఖర్, మండ్ల శివ ప్రసాద్, బొంతల కృష్ణ, మద్దెల లక్ష్మి, జి.వి.రెడ్డి, యక్కలి కమలగుప్త, నాగరాజు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande