తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడి
తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడి
rain


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. హైదరాబాద్ నగరం మరియు మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు పడే అవకాశం లేనప్పటికీ, ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వర్షాలు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రానున్న రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande