
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఘోరమైన హత్య ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక నాగార్జున స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాత కక్షలు లేదా కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు నిశితంగా పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు స్థానిక సీఐ తెలిపారు. నిత్యం ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడిని ఇలా దారుణంగా హతమార్చడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi