
తిరుమల, 12 ఆగస్టు (హి.స.)తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఈ - వీసా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం విదేశీ భక్తులు రావాలంటే.. ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ -వీసా ప్రక్రియ పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకునే వారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV