వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి
వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి
భానుప్రకాశ్ రెడ్డి


నెల్లూరు, 12 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని వైసీపీ నేతలు.. వీధి నాటకాల్లో రాజకీయాలకు వాడుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యారు. వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. స్వామి వారి అలిపిరి పాదాల వద్దకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2019 నుంచి 2024 వరకు స్వామి వద్ద చేయకూడని తప్పులు చేశారని భానుప్రకాశ్ విమర్శించారు. రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. డీఎస్సీ పేరు మీద డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ జరగకూడదంటూ దుర్మార్గపు ఆలోచనతో 32 కేసులు వేశారని వైసీపీ నేతలపై భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande