రేపు కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
రేపు కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు


కర్నూలు, 12 ఆగస్టు (హి.స.) ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులు, కుమారుడితో కలిసి ఇటీవల చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేసి, కారు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని కేసు నమోదైంది. పురుషోత్తం,విరూపాక్షి అనుచరుడికి మధ్య గొడవ జరగ్గా.. అనుచరుడు ఫోన్ చేయడంతో విరూపాక్షి నేమకల్లుకు వెళ్లి పురుషోత్తం ఇంటిపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే తన అనుచరులతో వాహనాల్లో భారీగా వెళ్లి హల్ చల్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే కేసులు విరూపాక్షిని కర్నూలులోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు ఆయనను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వెళుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande