
కృష్ణా(గన్నవరం):, 13 ఆగస్టు (హి.స.)
సైకిల్ తొక్కుకుంటూ బాలుడు పోలవరం కుడి కాలువలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆరుమళ్ల లీలామోహన్ రెడ్డి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న బాలుడు.. స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి సైకిల్ తొక్కుకుంటూ ఏడు గంటల సమయంలో బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో జారి పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ