
అనకాపల్లి జిల్లా , 13 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితఅనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఈరోజు (గురువారం) పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనితకు అడుగడుగున హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంటింటి ప్రచారం చేశారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన విద్యార్థి వరహాలు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరహాలు బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ