గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు.ప్రారంభం
గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు.ప్రారంభం
Indigo Airlines


గన్నవరం, 13 ఆగస్టు (హి.స.)

గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్గా సర్వీసులను ప్రారంభించారు. దీంతో గన్నవరం నుంచి వారణాసి, కోల్కతాకు కొత్త సర్వీసులను ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో నడపనుంది. వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడవనున్నాయి. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో గన్నవరం నుంచి వారణాసి, కోల్కతాకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఇండిగో సంస్థ వెల్లడించింది.

-

ఫ్లైట్ నంబర్ 6E 6501(వారణాసి-విజయవాడ సర్వీస్): మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరి, సాయంత్ర 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

-

ఫ్లైట్ నంబర్ 6E 6502(విజయవాడ-వారణాసి సర్వీస్): గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సాయంత్రం 06:20 గంటలకు బయలుదేరి, రాత్రి 08:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరిగి బయలుదేరి రాత్రి 10:15 గంటలకు కోల్కతా చేరుకుంటుంది.

-

తిరుగు ప్రయాణం(6E 6501): మధ్యాహ్నం 02:10 గంటలకు కోల్కతాలో బయలుదేరి, వారణాసి మీదుగా సాయంత్రం 05:50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande