అంకిరెడ్డిపాలెం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్
అంకిరెడ్డిపాలెం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్
అంకిరెడ్డిపాలెం సమీపంలో  అదుపు తప్పి బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్

గుంటూరు, 13 ఆగస్టు (హి.స.)

జాతీయ రహదారిపై అంకిరెడ్డిపాలెం సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నల్లపాడు పోలీసులు క్రేన్ సాయంతో ట్యాంకర్ను రోడ్డు పక్కకు తొలగించారు. ట్యాంకర్ కాకినాడ నుంచి అనంతపురం వైపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande