ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పై.ప్రత్యేక దృష్టి సాధిస్తాము.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పై.ప్రత్యేక దృష్టి సాధిస్తాము.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
pawan


విశాఖపట్నం 13 ఆగస్టు (హి.స.)

ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్వ్యాఖ్యానించారు. అవి అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉద్ఘాటించారు. ఏనుగుల కారిడార్ల రక్షణ, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ బలోపేతం, సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వరల్డ్ ఎలిఫెండ్ డే వేడుకలను విశాఖపట్నంలో ఈరోజు (గురువారం) నిర్వహించారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande