లోక్ సభ నిరవధిక వాయిదా.. వందేమాతరం గీతాలాపనతో ముగిసిన సభ
లోక్ సభ నిరవధిక వాయిదా.. వందేమాతరం గీతాలాపనతో ముగిసిన సభ
Loksabha


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

లోక్ సభ సమావేశాలు ప్రారంభమైనకొద్దిసేపటికే నిరవధిక వాయిదా వేశారు. వందేమాతరం గీతాలాపన చేసి సభను ముగించేశారు. సభకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. సమావేశాలు జరగకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా ఎలాంటి చర్చలు సేకుండానే సాగాయి. ప్రతిరోజు వాయిదాలకే సరిపోయింది. 18రోజుల పాటు నిరసనల మధ్యనే సభ జరగ్గా,నేడు సైతం నిరసనలు కొనసాగాయి. పలు అంశాలపై చర్చకు అవకాశం లేకుండానే బిల్లులను కూడా ఆమోదించారు. పలు బిల్లులకు మూజువాణి ఓటుతోనే ఆమోదం తెలిపారు. చివరి రోజు వాడీవేడిగా సమావేశాలు సాగుతాయని ఆశించినప్పటికీ నిరవదికవాయిదా పడింది. నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ పై కూడా అమిత్ షా సమాధానం ఇవ్వకుండా ముగిసిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande