పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు.. విపక్షాలపై కిరణ్ రిజిజు ఫైర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు.. విపక్షాలపై కిరణ్ రిజిజు ఫైర్
Parliament


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

సభలో అసలు చర్చలే జరగకూడదు అనేలా ప్రతిపక్షాలు ప్రవర్తించాయని, వారి అడ్డంకుల వల్లే సభ సమయం వృథా అయిందని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు కావాలనే చర్చల నుంచి పారిపోతున్నాయని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాలని ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డాలి.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. కానీ ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టకుండా పారిపోతున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ముగిశాయి. లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజిజు.. విపక్షాల ఆందోళనలతో చర్చలు సరిగా జరగలేదని వెల్లడించారు.

లోక్ సభలో 19, రాజ్యసభలో 39 శాతం మాత్రమే చర్చ:

లోక్ సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 11 బిల్లులు ఆమోదం పొందాయని, లోక్ సభలో కేవలం 19 శాతం, రాజ్యసభలో 39 శాతం సమయం మాత్రమే చర్చ జరిగిందన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు' పై మాత్రమే లోక్సభలో పూర్తిస్థాయి చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఒక్క బిల్లుపైనే ఉభయ సభల్లో విస్తృత చర్చ జరిగి ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. విపక్షాలు ఎంత రగడ సృష్టించినా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు కొందరు ప్రతిపక్ష ఎంపీలు చర్చల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande