
అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
మార్కాపురం గ్రామీణం, మార్కాపురం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘దేశ నిర్మాణంలో భాగస్వాములం’ అనే నినాదంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తిరంగా ర్యాలీలో జిల్లా పోలీసు అధికారి (ఓఎస్డీ) నవజ్యోతి మిశ్రా, డీఎస్పీ నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. ప్రధాన మార్గం గుండా సాగుతూ కోర్టు సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు జాతీయ జెండాలను చేతబట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, యువతలో దేశం పట్ల సేవా భావాన్ని పెంపొందించే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ