ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జిల్లా అధికారి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జిల్లా అధికారి
Medical officer


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) ఆమనగల్లు నూతన 50 పడకల

ప్రభుత్వ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారిణి (డీసీహెచ్ఎస్) అనురాగిణి పరిశీలించారు. డీఈ కోటేశ్వరరావుతో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవన నిర్మాణ పురోగతి, అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవసరమైన వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను, సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆమనగల్లు పరిసర ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు, రోగులకు అందించాల్సిన సేవలపై కూడా ఆమె ఆరా తీశారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande