
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తో ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షల ఓట్లు గల్లంతు కావడం రాజకీయవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాల్లో మొత్తం 4.57 లక్షల ఓట్లు కట్ కావడం గమనార్హం. ఆ ఓట్లు మొత్తం తొలగించినట్లుగానే లెక్క. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షల ఓట్లు ఓటు జాబితా నుంచి తొలగిపోయాయి.సిద్దిపేట జిల్లాలో 1.15 లక్షలు, మెదక్ జిల్లాలో అతి తక్కువగా 42,934 ఓట్లు కట్ అయ్యాయి. అత్యధికంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 91.51 శాతం డిజిటలైజేషన్ పూర్తి కావడం విశేషంగా చెప్పకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 84.16 శాతం డిజిటలైజేన్ కాగా మెదక్ జిల్లాలో 90.52 శాతం, సిద్దిపేట జిల్లాలో 88.04 శాతం నమోదైంది.
ఫస్ట్ మెదక్.. లాస్ట్ పటాన్ చెరు..
ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇందులో మెదక్ సెగ్మెంట్ 91.51 శాతంతో మొదట ఉండగా పటాన్ చెరు సెగ్మెంట్ 68.06తో చివరన ఉన్నది. మెదక్ జిల్లాలో వసల కార్మికులు లేకపోవడంతో అక్కడ డిజిటలైజేషన్ సక్సెస్ అయినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.పటాన్ చెరులో భారీ స్థాయిలో అంటే లక్ష 36 ఓట్లు గల్లంతు కావడానికి కార్మికులే కారణంగా చెప్పుకోవచ్చు.అడ్రస్ మారిపోవడం, తమ పేరు నమోదుకు ముందుకు రాకపోవడంతో లెక్క తగ్గింది. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కార్మికులు, ఇతర ప్రాంతాల వారు ఉంటున్నప్పటికీ 50 వేల మేర మాత్రమే ఓట్లు కట్ కావడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు