
టెక్కలి, 13 ఆగస్టు (హి.స.)
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు తెదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. టెక్కలి తెదేపా కార్యాలయం నుంచి అన్నా క్యాంటీన్, అంబేడ్కర్ జంక్షన్, చేరి వీధి మీదుగా ఈ ర్యాలీ సాగింది. తెదేపా టెక్కలి మండలాధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో తెదేపా ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ