ఎర్రకోట బాంబు పేలుళ్ల వెనుక అల్ ఖైదా హస్తం : ఐరాస నివేదిక వెల్లడి
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత ఏడాది నవంబర్ 2025లో జరిగిన విధ్వంసకర కారు బాంబు పేలుడు ఘటనకు అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన ఆంక్షల పర్యవేక్షణ
Uno


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత

ఏడాది నవంబర్ 2025లో జరిగిన విధ్వంసకర కారు బాంబు పేలుడు ఘటనకు అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన ఆంక్షల పర్యవేక్షణ బృందం తమ తాజా నివేదికలో అధికారికంగా వెల్లడించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద నవంబర్ 10, 2025న వెహికల్ రిలేటెడ్ ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (VBIED) ద్వారా జరిగిన ఈ పేలుడులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ దాడికి ఏక్యూఐఎస్తో సంబంధం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, బంగ్లాదేశ్ కేంద్రంగా కొత్త సెల్స్ను ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా ఎదగడానికి ఏక్యూఐఎస్ ప్రయత్నిస్తోందని, నిధుల సేకరణతో పాటు చిన్న వికేంద్రీకృత బృందాలుగా ఇవి విస్తరిస్తున్నాయని ఐరాస నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా.. ఈ తీవ్రవాద దాడి ఘటనపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన భారత్కు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఏడాది మే నెలలో 10 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఏక్యూఐఎస్ అనుబంధ సంస్థ అయిన అన్సార్ గజ్వాత్-ఉల్-హింగ్తో సంబంధం ఉన్న ఈ నిందితులలో ప్రధాన సూత్రధారిగా ఫరీదాబాద్లోని అల్-ఫలా విశ్వవిద్యాలయ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమర్ ఉన్-నబీని పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో సంభవించిన పేలుడులోనే నిందితుడు ఉమర్ ఉన్-నబీ మరణించినట్లు ఎన్ఐఏ తమ చార్జిషీట్లో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande