ఏం చేయలేం.. ప్రతిపక్ష హోదాపై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు
ఏం చేయలేం.. ప్రతిపక్ష హోదాపై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు


Andhra Pradesh, 13 ఆగస్టు (హి.స.) ప్రతిపక్ష హోదాపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రావొద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఏం చేయలేమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చెప్పాల్సినవి అన్నీ ప్రెస్ మీట్ లో చెబుతానని పేర్కొన్నారు. అంతేకాకుండా సభ బయటే సమస్యలపై పోరాటం చేయాలని ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేశారు. మండలిలో స్ట్రాంగ్ గా ఉన్నామని అక్కడే కొట్లాడతామని తెలిపారు. రైతుల సమస్యలను మండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీలకు సూచించారు.

ఫీజు రియంబెర్స్ మెంట్ పై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వైసీపీ నేతల అరెస్టులు, దిశ అంశంపైనా చర్చించాలని సూచించారు. విజన్ 2047 మరియు శ్వేత పత్రాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిరసనకారులపై కేసుల గురించి కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరవాత జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టడంలేదు. కూటమి నాయకులు విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడంలేదు. ఇక ఇప్పుడు ఏకంగా అసెంబ్లీకి రావొద్దని నిర్ణయం తీసుకోవడంపై మరింత విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande