తిరుమలలో కంపార్టుమెంట్లన్నీ ఫుల్..!
తిరుమలలో కంపార్టుమెంట్లన్నీ ఫుల్..!
తిరుమల


తిరుమల, 13 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయానికి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్లయ్యాయి. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5-6 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల పడుతుందని తెలిపింది. అలాగే నిన్న (బుధవారం) స్వామివారిని 82,800 మంది భక్తులు దర్శించుకోగా.. 27,525 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.68 కోట్లు సమకూరింది. 4.34 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. నేటి నుంచి శ్రావణమాసం ఆరంభం కావడంతో తిరుమలలో పెళ్లిళ్లు జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande