
ఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) ఢిల్లీలో స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల నేపథ్యంలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రముప్పు నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మందిరాలు లాంటి రద్దీ ప్రదేశాల్లో నిరంతరం నిఘా పెడుతున్నారు. అంతేకాకుండా నగర వ్యాప్తంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలను పోస్టర్ల రూపంలో అంటిస్తున్నారు. ఈ 19మంది ఇండియన్ ముజాహిదీన్, అల్ ఖైతా, ఖలిస్థాని తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఉగ్రవాదుల పట్ల ముందుగానే పౌరులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV