
పెనుకొండ, 13 ఆగస్టు (హి.స.)పెనుకొండ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశంకార్యక్రమంలో భాగంగా పెనుకొండ పట్టణంలోని ఈద్గా వద్ద 8,9 వార్డుల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రెండు సంవత్సరాల నమ్మకం రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమం అనే నినాదానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత వంటి అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత వేగవంతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలు చేరేలా కృషి కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV