జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలు జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు.
tension-during-jagans-kurnool-district-tour-576832


కర్నూలు, 13 ఆగస్టు (హి.స.) మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలు జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. కాగా ఈ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనకు కర్నూలు వెళుతున్న వాహనాలను ఎమ్మిగనూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రాలయం నేత ప్రదీప్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మరో ఇప్పటికే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కర్నూలు వద్ద పోలుసులు కంచె ఏర్పాటు చేశారు. జైలుకు కిలో మీటర్ దూరంలో ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు. విరూపాక్షి సతీమణి వాహనాన్ని మాత్రమే జైలులోపలికి పంపారు. జగన్ పర్యటనకు కూడా ఎనిమిది వాహనాలకే పర్మిషన్ ఇచ్చారు. పర్యటనలో జగన్ వెంట మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. జగన్ ములాఖత్ త్వరగా ముగించాలని పోలీస్ అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande