ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య
ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య
murder


మదనపల్లె, 13 ఆగస్టు (హి.స.) ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసింది. ఈ ఘటన మదనపల్లె జిల్లా పీలేరులో చోటు చేసుకుంది. ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం... మదనపల్లె జిల్లా పీలేరుకు చెందిన ఉమాదేవి, వెంకట సుబ్రహ్మణ్యం భార్య భర్తలు. కాగా రెండేళ్ల నుండి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఉమాదేవికి చారా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అనంతరం ఉమాదేవి తన భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తిన్న తరవాత భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడిని పిలిచి ఇద్దరూ కలిసి హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు మృతదేహాన్ని తిరుపతి మదనపల్లె రోడ్డుపై పడేశారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులకు డెడ్ బాడీని చూస్తే అనుమానం వచ్చింది. దీంతో తమ స్టైల్ లో విచారణ జరపగా భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande