రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్తు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్తు
electricity


అమరావతి, 14 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్తు శాఖపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ ధరకు నిరంతర విద్యుత్తు అందించే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్తు కొనుగోలు ధరను ఈ ఏడాది యూనిట్కు రూ.4.60కు, 2029 నాటికి రూ.4కు తీసుకురావాలని చెప్పారు. తక్కువ ధర విద్యుత్తు కొనుగోలుతోపాటు పవర్ స్వాపింగ్, కుసుమ్, పీఎం సూర్యఘర్, పునరుత్పాదక విద్యుత్తు, స్టోరేజీ వంటి వివిధ మోడళ్లను అనుసంధానం చేయాలన్నారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్యఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande