
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల అభ్యర్థులకు సకాలంలో సేవలు అందేలా చూడటంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత స్పష్టం చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆమె అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికలను, దస్త్రాల (Files) పెండింగ్ వివరాలను పరిశీలించారు. విధులకు ఆలస్యంగా రావడం, ప్రజల అర్జీలపై సకాలంలో స్పందించకపోవడం వంటి నిర్లక్ష్య వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యోగులు, సిబ్బంది తమ విధులకు కట్టుబడి ఉండాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi