
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి
వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేపట్టారు. భద్రాద్రి వచ్చే భక్తులు అయోమయానికి లోనుకాకుండా.. దర్శనం, సేవలు, పూజలు వివరాలతో పాటు సమగ్ర సమాచారం తెలిపేందుకు, రామాలయానికి వెళ్లే ప్రారంభంలో ఆలయ అధికారులు సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. మిథిలా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని ఆలయ ఈవో దామోదర్ రావు శుక్రవారం ప్రారంభించారు. సమాచార కేంద్రంలో స్వామివారి దర్శనార్థమయ్యే వచ్చే భక్తులు ఆలయం సంబంధించి అన్ని సమాచారాలు తెలుసుకొనే సదుపాయాన్ని కల్పించి రాబోవు రోజుల్లో అక్కడే వివిధ సేవల టిక్కెట్లను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే భక్తులు సమాచార కేంద్రాన్ని సంప్రదించి వారికి అవసరమైన సమాచారాన్ని పొంది స్వామి వారి కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు