ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం: బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం: బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
Cji


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్లోని 'నల్సార్' (NALSAR) లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) జారీ చేసిన కఠినమైన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న విషయని కామెంట్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల నిరసనల పట్ల సర్దుబాటు ధోరణి అవసరమని పరోక్షంగా సూచించారు.

కాగా, కాన్వొకేషన్కు భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ నాల్సార్ విద్యార్థులు లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. 2026 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన నాల్సార్ గ్రాడ్యుయేట్లను దేశంలోని ఏ బార్ కౌన్సిల్లోనూ అడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకోకూడదని, వారిపై నిషేధం విధిస్తున్నట్లుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదట ఆదేశాలు జారీ చేసింది. అయితే, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ నిర్ణయంపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. సీజేఐ వ్యాఖ్యల అనంతరం పరిణామాలను పున:సమీక్షించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, విద్యార్థులపై విధించిన సస్పెన్షన్, ఎన్రోల్మెంట్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. మెజారిటీ విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు వ్యక్తుల వల్లే వివాదం ఏర్పడిందని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande