ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు
ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Train


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16నుంచి 31వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15గంటలకు 07197 ప్రత్యేక రైలు, ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు కొట్టాయం నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, తిరుపూర్, పోడనూర్, పాలక్కడ్, త్రిశూర్, అలువ, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలుకు సెకండ్ ఏసీ, థర్డ్ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ క్లాస్ బోగీలు కూడా ఉంటాయని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande