మన సైన్యాన్ని చైనా అడ్డుకుంటే మోడీ, షా ఎందుకు సైలెంట్గా ఉన్నారు: రాహుల్ గాంధీ
మన సైన్యాన్ని చైనా అడ్డుకుంటే మోడీ, షా ఎందుకు సైలెంట్గా ఉన్నారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్రదేశ్లో పలు ప్రాంతాల్లో మన సైన్యం పెట్రోలింగ్ చేయకుండా చైనా అడ్డుకుంటోందని అన్నారు. ఇది చాలా ఆందోళనకరం అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అంతకంటే ఆందోళనకరమైన విషయం అని అన్నారు. చైనాను అడ్డుకునే బదులు ఈ వార్తను అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి తెస్తోందని చెప్పారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా మన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని ప్రధాని చెప్పిన మాటలను దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని అన్నారు.

దేశ భద్రత కంటే తన నకిలీ ఇమేజ్కే ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం మండిపడ్డారు. ఈ రోజుకు కూడా మోడీ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు అదే ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రదేశాల పేరు మార్పుపై చైనా ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేయగా, దానికి ప్రతిస్పందనగా అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఆ తరవాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని 27 ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెట్టడానికి చైనా ప్రయత్నం చేయగా, వాటిని తిప్పికొడుతూ భారతదేశం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో అరుణాచల్ లోని 27 ప్రాంతాలను వాటి ప్రామాణిక పేర్లతో అధికారికంగా గుర్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande