సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమం.. హాజరైన హీరో నాగార్జున
సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించింది.
Nagarjuna


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ను చేపట్టింది.

తెలంగాణ వ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘Stay Alert , Stay Aware, Stay Safe & Secure’ నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande