సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ. డీజీపీ సీవీ ఆనంద్
సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ. డీజీపీ సీవీ ఆనంద్
Dgp


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. అందుకే సురక్ష కా తిరంగలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. 40 రకాల సైబర్ నేరాలను గుర్తించామన్నారు. ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సురక్ష కా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డీజీపీ.. ప్రజలు కూడా మోసపూరిత, అపరిచిత వ్యక్తులు పంపిన లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపుతున్నారంటే అనుమానించాలని డబ్బుల విషయంలో అత్యాశకు పోవద్దని సూచించారు. ఎక్కువ డబ్బులు ఇస్తామంటున్నారంటే అందులో మోసం ఉందని గ్రహించాలని హెచ్చరించారు.

సినిమా ఇండస్ట్రీకి రూ.22 వేల కోట్ల నష్టం:

డిజిటల్ అరెస్టు విషయంలో పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ప్రజలు ప్రస్తుతం అప్రమత్తం అవుతున్నారని చెప్పారు. డ్రగ్స్ బారిన పడి విద్యార్థులు, యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. నిందితులు ఎక్కడో పట్నాలో కూర్చుని సర్వర్లు హ్యాక్ చేస్తున్నారు. నిందితులు కొన్నేళ్లుగా సినిమా పైరసీకి పాల్పడుతున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande