రాఖీ పండుగ కానుక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఏర్పాట్లు
రాఖీ పండుగ కానుక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఏర్పాట్లు
రాఖీ పండుగ కానుక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఏర్పాట్లు


, 14 ఆగస్టు (హి.స.)

హన్మకొండ బస్ స్టేషన్ / వరంగల్ పరిసరాలు

మహా లక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రాఖీ పూర్ణిమ (రక్షాబంధన్) పండుగను పురస్కరించుకుని హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని మహిళా ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రోజున సోదరులకు రాఖీలు కట్టేందుకు వెళ్లే మహిళల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో, హన్మకొండ ప్రధాన బస్ స్టాండ్ నుండి గ్రామీణ మరియు పట్టణ రూట్లలో అదనపు బస్సులను నడపాలని రీజినల్ మేనేజర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా వర్తిస్తుంది. బస్టాండ్లలో మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం మరియు భద్రత కోసం అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించనున్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా డిపోల వారీగా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande