
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
ఏపి వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈఏడాది తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతీయ జెండా వేడుకలను నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ