నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పూర్తి కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి.. సీఎం రేవంత్ రెడ్డి
నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పూర్తి కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని

పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యాన్ని నింపి, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కొత్త ఊపు నివ్వాలని ఆయన ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్నీ, ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా స్మరించుకున్నారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందించి అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన బలమైన ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మించడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అందించే దిశగా.. నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పూర్తి కర్తవ్యనిష్టతో, అంకితభావంతో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande