ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ముందస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ముందస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ముందస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం

ఆదిలాబాద్, 15 ఆగస్టు (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు చేసే రైతాంగానికి ఊరటనిస్తూ ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, దళారీల దోపిడీని అరికట్టేందుకు మరియు రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర (MSP) సకాలంలో అందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్కెటింగ్ మరియు సహకార శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని, కాంటాలు వేయడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠిన నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande