ఖిలా వరంగల్లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
Minister


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

ఖిలా వరంగల్ ఖుషీ మహల్ ప్రాంగణంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, డీఎఫ్ఎ నిఖిత, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు, స్కూల్ పిల్లలు హాజరయ్యారు. తొలుత మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గేయాలాపన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతి పై జిల్లా ప్రగతి నివేదికను మంత్రి కొండా సురేఖ ప్రజలకు వివరించారు. తదుపరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి కొండా సురేఖ తిలకించారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులను పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు, శాలువాతో సన్మానించారు. ఉత్తమ అధికారులు, ఉద్యోగస్తులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు. వివిధ శాఖల చే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్ పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసులు, స్వాతంత్య్ర సమరయోధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande