కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: మంత్రి పొన్నం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: మంత్రి పొన్నం
Minister


సిద్దిపేట, 15 ఆగస్టు (హి.స.)

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది అన్నారు.

ఎలీనో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరు తడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతు భరోసా పథకంలో ఎకరాకు 6వేల చొప్పున 3 లక్షల 25 వేల మంది రైతులకు మొత్తం రూ.1476 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్కు అదనపు టీఎంసీ పనులను రూ. రూ 14,402 కోట్ల తో చేపట్టినట్లు వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. పట్టు ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల హరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత” పింఛన్ పథకంలో భాగంగా కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. మండల సమాఖ్యల చేత ఆర్టీసీ బస్సులు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణం పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంచడానికి.. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించి 5,18,036 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం తోపాటుగా రూ.1,228 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రూ.670.23 కోట్లతో 158.45 కిమీ మేర 13 రోడ్ల పనులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్నివిస్తరించి, ఆరోగ్య బీమా కవరేజీని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటుగా, 1,835 వ్యాధులకు పథకం వర్తించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచడానికి 100 శాతం సబ్సిడీతో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమంలో బాగంగా గర్భిణీలకు బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. రూ.6 కోట్ల 29 లక్షలతో సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎర్ర చెరువు వద్ద భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, రూ.2 కోట్ల 50 లక్షల నిధులతో జంక్షన్ డెవలప్మెంట్, లేక్ రిజువెనేషన్, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande