స్మార్ట్ కార్డుల పై రాజకీయం చేస్తే సహించేది లేదు : మంత్రి ఉత్తమ్
స్మార్ట్ కార్డుల పై రాజకీయం చేస్తే సహించేది లేదు : మంత్రి ఉత్తమ్
Minister


సూర్యాపేట, 15 ఆగస్టు (హి.స.)

స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పై రాజకీయ రాద్ధాంతం చేయొద్దని సూచించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రేషన్ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా స్మార్ట్ కార్డులను అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం రూ.14.9 వేల కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీ పై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరకొరగా కార్డులు ఇచ్చినవాళ్లు.. అసలు కార్డులు ఇవ్వని వాళ్లు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. మా ప్రయత్నాన్ని విమర్శించడం మాని అభినందించండి” అని అన్నారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande